Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలితాల కోసం ఎదురుచూసిన ప్రభాకరన్

Webdunia
దివంగత ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇటీవల ముగిసిన యుద్ధంలో తన తరువాతి వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు భారత్‌లో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూసినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో 30 ఏళ్లపాటు సాగిన అంతర్యుద్ధానికి ఇటీవల ప్రభాకరన్ మరణంతో తెరపడిన సంగతి తెలిసిందే.

ఈ యుద్ధం చివరి రోజుల్లో శ్రీలంక సైన్యంచే అతితక్కువ ప్రాంతానికి పరిమితమైన ఎల్టీటీఈ బలగాలకు తదుపరి వ్యూహాన్ని తయారు చేసి ఇచ్చేందుకు ప్రభాకరన్ భారత్‌లో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూశారని, ఆయన భారత్‌లో ఎన్డీఏ లేదా తృతీయ కూటమి అధికారంలోకి వస్తుందని భావించినట్లు సమాచారం. అయితే శ్రీలంక ఆర్మీ వద్ద అప్పటికే భిన్నమైన ప్రణాళికలు ఉన్నాయి.

తన, తన నేతృత్వంలోని ఎల్టీటీఈ భవితవ్యాన్ని నిర్ణయించుకునేందుకు భారత్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన మే- 16 వరకు ప్రభాకరన్ ఎదురుచూశారు. అయితే అప్పటికే శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో పరిస్థితులు ఎల్టీటీఈ చేయిదాటాయి.

శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ బలగాలను అన్నివైపుల నుంచి దిగ్బంధించింది. వారు తప్పించుకునే మార్గాలు లేకుండా చేసింది. మే- 16 తరువాత భారత్ నుంచి ఎవరో ఒకరు జోక్యం చేసుకొని శ్రీలంక సైన్యాన్ని అడ్డుకుంటారని, తాము తలదాచుకున్న చివరి కాల్పుల రహిత మండలంలోకి సైన్యాన్ని అడుగుపెట్టకుండా చూస్తారని ప్రభాకరన్ భావించినట్లు శ్రీలంక ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments