Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ మారితే భార్యకు విడాకులివ్వాల్సిందే...!

పార్టీ మారితే భార్యకు విడాకులివ్వాల్సిందే...!
, గురువారం, 12 నవంబరు 2009 (18:04 IST)
ప్రజానాయకులు పార్టీలు మారితే పలుదేశాల్లో చట్టసభల్లో సభ్యత్వం రద్దుచేయబడే నిబంధన లున్నాయి. అయితే మలేషియాలోని ప్రతిపక్ష పార్టీ అయిన ఫైన్ మలేషియా ఇస్లామిక్‌ పార్టీ తమ పార్టీనుంచి ఎన్నికైన సభ్యులు భవిష్యత్తులో పార్టీమారితే వారి భార్యలకు విడాకులు ఇస్తామని ప్రమాణాలు చేయించబడ్డారు.

నిరుడు జరిగిన ఎన్నికల్లో రూపొందించబడిన ఈ నిబంధన తర్వాత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ నియమాలను సమర్ధిస్తూ వీటిని అమలుచేయాల్సిందేనని ఈ పార్టీ నేత ఖాలిద్‌ సమద్‌ పట్టుబడుతున్నారు.

రాజకీయాలు అనేవి ఆటలుకావు పార్టీలు మారటంవల్ల తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేసినట్లౌతుందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా ఆ దేశ మంత్రి షరిజాద్‌ జలీల్‌ ప్రతిపక్షపార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని వీడితే భార్యను వదలడం కూడా ఆటకాదని స్థానిక పత్రిక న్యూటైమ్స్‌ మాధ్యమంగా ప్రకటించారు.

ఏది ఏమైనప్పటికీ ప్రతి దేశంలోను ఇలాంటి చట్టాలు రావాలని, దీంతో పార్టీలు మారకుండా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu