Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో సుఫీ మొహమ్మద్ సహాయకుల మృతి

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శనివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నిషేధిత తాలిబాన్ అనుబంధ గ్రూపుకు చెందిన ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. పాకిస్థాన్ ప్రభుత్వం, తాలిబాన్ తీవ్రవాదుల మధ్య వివాదాస్పద స్వాత్ శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన గ్రూపు కూడా ఇదే కావడం గమనార్హం.

నిర్బంధించిన ఉగ్రవాదులను పెషావర్‌లోని జైలుకు తీసుకెళుతున్న భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్లు పంజా విసిరారు. తాలిబాన్ల ఆకస్మిక దాడిలో తెహ్రీక్ ఎ నిఫాజ్ ఎ షరియా మొహమ్మదీ (టీఎన్ఎస్ఎం) డిప్యూటీ చీఫ్ మౌలానా ముహమ్మద్ ఆలం, ఆ గ్రూపు ప్రతినిధి అమీర్ ఇజాత్ ఖాన్, మరో అధికారి మృతి చెందారు. అతివాద మతపెద్ద సుఫీ మొహమ్మద్ ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు.

సమస్యాత్మక మలకాండ్ ప్రాంతంలో శనివారం ఉదయం 5.10 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని మిలటరీ తెలిపింది. దాడిలో ఐదుగురు సైనికులు కూడా గాయపడ్డారు. స్వాత్ లోయలో తాలిబాన్లపై సైనిక చర్యలో అరెస్టు చేసిన అనేక మంది ఖైదీలను పెషావర్‌కు తరలిస్తుండగా తీవ్రవాదులు ఈ దాడి చేశారని మిలటరీ అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments