Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ సాయం బిల్లుపై సంతకం చేసిన ఒబామా!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2009 (09:39 IST)
పాకిస్థాన్‌కు అమెరికా అందించే సాయం బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం పాకిస్థాన్‌కు అమెరికా 7.5 బిలియన్‌ డాలర్ల సాయం అందుతుంది. దీనికి చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన కెర్రీ-లూగార్‌ బిల్లుపై ఆయన గురువారం సంతకం చేశారు.

2009 పాకిస్థాన్‌తో భాగస్వామ్య విస్తరణ చట్టాన్నే కెరీ-లూగార్‌ బిల్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై శ్వేతసౌధం అధికార ప్రతినిధి రాబర్ట్‌ గిబ్స్‌ మీడియాతో మాట్లాడుతూ ఒబామకు సమర్పించిన నాటి నుంచి నిర్ణీత గడువు పది రోజుల సమయం ముగిసేలోగా సంతకం చేయాల్సి వుంటుందని, ఆ ప్రకారం గురువారం సంతకం చేశారని చెప్పారు. ఈ బిల్లుపై పాకిస్థాన్‌ ఇటీవల వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న అమెరికా కాంగ్రెస్‌ పాకిస్థాన్‌ సందేహాలను నివృత్తి చేసే దిశలో వివరణాత్మక ప్రకటనను కూడా జారీ చేసింది.

పాకిస్థాన్‌ సార్వభౌమత్వానికి, భద్రత ప్రయోజనాలకు కెర్రీ-లూగార్‌ బిల్లు ఎలాంటి అవరోధంగా నిలువదని స్పష్టం చేసింది. ఈ బిల్లు మేరకు వచ్చే ఐదేళ్ళలో ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఈ మొత్తాన్ని సైనిక కార్యకలాపాలకు కాకుండా, తీవ్రవాదుల అణిచివేతకు ఉపయోగించాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments