Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణ సూడాన్‌లో సంబరాలు: హాజరైన ప్రపంచ నాయకులు

దక్షిణ సూడాన్‌లో సంబరాలు: హాజరైన ప్రపంచ నాయకులు
దక్షిణ సూడాన్ ప్రజలు, వివిధ దేశాల నాయకులు, తొలి అధ్యక్షుడు హాజరు మధ్య ప్రపంచంలో నూతన దేశంగా ఆవిర్భవించిన దక్షిణా సూడాన్ నూతన రాజధాని జుబాలో శనివారం ఆ దేశ అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రితో పాటు వివిధ దేశాలకు చెందిన డజన్ల మంది నాయకులు పాల్గొన్న ఈ వేడుకల్లో దక్షిణ సూడాన్ తొలి అధ్యక్షుడిగా సాల్వకీర్ బాధ్యతలు చేపట్టారు. జుబాలో అత్యంత అప్రఖ్యాతి పాలైన సుడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బాషిర్ కూడా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వేలాది మంది దక్షిణ సూడాన్ ప్రజలు ఈ వేడుకలకు చూడటానికి తరలివచ్చారు. అయితే నిర్వాహకులు ఈ వేడుకలకు హాజరైన వివిధ దేశాలకు చెందిన నేతలు, ముఖ్యులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోయారు.

దక్షిణ సూడాన్‌లోని గిరిజన, ముస్లీం తెగలకు మధ్య సుమారు ఐదు దశాబ్దాల మధ్య పౌర యుద్ధం జరిగింది. 1983-2005 మధ్య కాలంలో సుమారు రెండు లక్షల మంది మరణించారు. 2005లో కుదిరిన శాంతి ఒప్పందం శనివారం నాటి స్వాతంత్ర్య ప్రకటనకు దారితీసింది.

Share this Story:

Follow Webdunia telugu