Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ఇండో-చైనా ప్రధానమంత్రుల సమావేశం

Webdunia
FILE
వచ్చే వారం భారత్, చైనా దేశాల ప్రధానమంత్రుల సమావేశం జరగవచ్చని చైనాకు చెందిన ఓ పత్రిక శుక్రవారం వెల్లడించింది.

థాయ్‌లాండ్‌లో అక్టోబర్ నెల 23 నుంచి 25 మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల భేటీని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరోధించలేదని ఆ పత్రిక పేర్కొంది.

చైనా ప్రధాని వెన్ జియాబావో కార్యక్రమాలకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సచివాలయ ప్రతినిధి వెల్లడించినట్లు ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

మళ్ళీ తెరపైకి వచ్చిన సరిహద్దు సమస్య గురించి వెన్ మరియు సింగ్‌ల భేటి ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఆ పత్రిక పేర్కొంది.

ప్రస్తుతం చైనా అరుణాచలప్రదేశ్‌ను ఓ వివాదాస్పద ప్రాంతంగానే పరిగణిస్తోంది. ఇటీవలే భారతప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచలప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించడంపై నిప్పులు చెరిగింది. దీనికి ప్రతిస్పందిస్తూ... భారత్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం విదితమే. ఇలాంటి సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల బేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments