Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ అగ్రనాయకులు పాక్‌లోనే ఉన్నారు: హిల్లరీ

Webdunia
తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనాయకులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని, అక్కడినుంచే ఆ సంస్థకు చెందిన తీవ్రవాదులన ు పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోకి పంపి దాడులకు పాల్పడుతున్నారని అమెరికా తెలిపింది.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనాయకులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు.

పాక్ నుంచే వారు తమ సంస్థకు చెందిన తీవ్రవాదులను సరిహద్దుల్లోకి పంపి దాడులు చేయిస్తున్నారని ఆమె అన్నారు. ఇటీవల పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం, పాక్ భద్రతాదళాధికారి కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి ఆమె పై విధంగా స్పందించారు.

తాలిబన్ ప్రధాన నేతలు, అల్‌ఖైదాకు చెందిన అగ్రనాయకులు కూడా పాకిస్థాన్ దేశంలోనే ఉన్నారని, అక్కడి నుంచే వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ, తీవ్రవాదులను సరిహద్దుల్లోకి తరలించి దాడులు చేయిస్తున్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆఫ్గనిస్థాన్‌లోనే తాలిబన్లు స్థావరాలను ఏర్పరచుకుని ఉన్నరా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ...తాలిబన్లు తమ స్థావరాలను పాక్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో ఏర్పాటు చేసుకుని ఉన్నారని ఆమె అన్నారు.

తాలిబన్లు, అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులు అమాయకులైన గిరిజనులను పొట్టనబెట్టుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వారు అమెరికాకు చెందిన సైన్యం, అలాగే భారతదేశానికి చెందిన వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments