Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళునికి మరణ శిక్ష విధించిన మలేషియా కోర్టు!

తమిళునికి మరణ శిక్ష విధించిన మలేషియా కోర్టు!
, సోమవారం, 1 ఫిబ్రవరి 2010 (17:35 IST)
అక్రమ మాదక ద్రవ్యాల రవాణా కేసులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దంపతులకు జంటకు మలేషియా కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం వెలుగుచూసిన ఈ కేసు వివరాలు పరిశీలిస్తే.. తమిళనాడుకు చెందిన ఆదికేశన్ సింగారం (48) అనే వ్యక్తి మలేషిలోని ఒక జౌళి కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

గత 2008 సంవత్సరంలో జులై నెల 26వ తేదీన ఢిల్లీ నుంచి మలేషియాకు ప్రయాణించాడు. ఆ సమయంలో ఆయన కేటమిన్ అనే మాదకద్రవ్యాన్ని కౌలాలంపూర్‌కు తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని కౌలాలంపూర్ విమానాశ్రయ సిబ్బంది గుర్తించి ఆయనను అరెస్టు చేసింది.

ఈ కేసు విచారణ మలేషియా కోర్టులో జరుగగా, సింగారం మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించినట్టు నిరూపితమైంది. దీంతో మలేషియా కోర్టు ఆయనకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu