లిబియా రాజధాని ట్రిపోలీ శక్తిమంతమైన బాంబు పేలుళ్లడు చోటు చేసుకుంది. లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎన్టిసి) ఛైర్మన్ ముస్తఫా అబ్దుల్ జలీల్ రద్దు చేయడంతో తిరుగుబాటుదారులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్టు సమాచారం.
తూర్పు లిబియాలో తిరుగుబాటుదారులకు రాజధానిగా ఉన్న బెంఘాజీలో అధికారంలో ఉన్న తన ప్రభుత్వం మొత్తాన్నీ ముస్తఫా రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రక్షాళన అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతను ప్రధానమంత్రి మహ్మద్ జబ్రిల్కు అప్పగించినట్లు అధికార ప్రతినిధి షంషుద్దీన్ అబ్దుల్ మోలాహ చెప్పారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ట్రిపోలీకి నైరుతి దిశగా ఉన్న ఫర్నెజీ జిల్లాలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో ఆ దేశ సైనిక ఆయుధ కారాగారం దగ్ధమైనట్టు పేర్కొంది.