ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ శనివారం జపాన్ అణు సంక్షోభ తాకిడి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఫుకుషిమా అణు విపత్తు జోన్‌లో పర్యటిస్తున్న అత్యంత సీనియర్ విదేశాంగ నాయకుల్లో బాన్ కూడా ఒకరు.
స్వదేశం దక్షిణ కొరియాలో కూడా పర్యటించనున్న బాన్ కీమూన్ 25 సంవత్సరాల క్రితం సంభవించిన చెర్నోబిల్ సంఘటన తర్వాత మార్చి 11న రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం, సునామీలతో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అణు విపత్తును ఎదుర్కొన్న జపాన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయనున్నారు.
ఐదు నెలల నుంచి రేడియేషన్‌ను విడుదల చేస్తున్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రానికి ఉత్తరాన 25 మైళ్ల దూరంలో ఉన్న హరగామ బీచ్‌ను బాన్ సోమవారం సందర్శిస్తారు. మార్చిలో సంభవించిన భూకంపం, సునామీలో 21,000 మంది మరణించగా అనేక మంది అచూకీ ఇప్పటీకీ తెలియరాలేదు. బాన్ జపాన్ ప్రధాన మంత్రి నొవాటో కన్, విదేశాంగ మంత్రి తకెయకీ మట్సుమటోలను సోమవారం కలువనున్నారు.