Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాయత్రి మహామంత్రంపై పరిశోధనలు

గాయత్రి మహామంత్రంపై పరిశోధనలు
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోనున్న న్యూజెర్సీ నగరంలో గాయత్రీ మంత్రంపై పరిశోధనలు చేసేందుకు ఓ నూతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గాయత్రి మంత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరమైన వాతావరణాన్ని తీసుకు రావడమనేదే ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యమని కేంద్ర నిర్వాహకులు డాక్టర్ ప్రణవ్ పాండే తెలిపారు.

ఇక్కడ ఉద్భవించే గాయత్రి మంత్రంలోని ప్రకంపనల్లో ఎంతమాత్రం శక్తి ఉందో తాము పరిశోధన చేయనున్నట్లు ఆయన అన్నారు. తమతోపాటు మరికొంతమంది శాస్త్రజ్ఞులుకూడా ఉన్నారని ఆయన వివరించారు.

న్యూజెర్సీలోని పిస్కాతావేలో ప్రారంభమైన ఈ గాయత్రి చైతన్య కేంద్రంలో యజ్ఞ యాగాదులు, సంస్కారాలు మరియు ఇతర భారతీయ విధి విధానాలపై పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

తమ కేంద్రంలో శారీరక, మానసకి పరమైన శక్తిని పెంపొందించుకునేందుకుగాను కొన్ని యోగా కార్యక్రమాలు, ప్రాణాయామానికి చెందిన తరగతులను కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

తాము ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అన్ని వయసులవారికి పౌరాణిక గ్రంథాలు ఉదాహరణకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు భగవద్గీతకు సంబంధించిన ఆధ్యాత్నికపరమైన శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu