Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెన్నడీతో వివాహేతర సబంధం ఉండేది : 69 యేళ్ళ వృద్ధురాలు

కెన్నడీతో వివాహేతర సబంధం ఉండేది : 69 యేళ్ళ వృద్ధురాలు
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (04:07 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్‌ కెన్నడీతో తనకు వివాహేతర సంబంధం ఉండేదని వైట్‌హౌస్ 69 యేళ్ల మాజీ మహిళా ఉద్యోగి ఒకరు తాజాగా ఆరోపించారు. "ఓ కాలంలో రహస్యం : అధ్యక్షుడితో నా సంబంధం" అనే పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలను అమెరికా మీడియాలో బహిర్గతం చేసింది. ఇవి అమెరికాలో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి.

19 యేళ్ళ వయస్సులో ఉండగా ఆయన భార్య గదికి తనను తీసుకెళ్లారు. ఆ సమయంలో కెన్నడీ భార్య వైట్‌హౌస్‌లో లేరు. గదిలోకి వెళ్లిన తర్వాత తనను కొద్దికొద్దిగా ఆక్రమించుకుని పడకపై సంభోగం చేశారు. అంతేకాకుండా, అనే సందర్భాల్లో ఆయన స్నేహితుల వద్ద తనకు మాదకద్రవ్యాలు ఇచ్చి అనాగరికంగా ప్రవర్తించారని మిమీ పెర్స్‌లే అనే 69 యేళ్ళ వృద్ధురాలు తన పుస్తకంలో పేర్కొంది.

చనిపోయిన మాజీ అధ్యక్షుడు కెన్నడీ గురించి ఆ వృద్ధురాలు ఇపుడు ఈ తరహాలో ప్రచారం చేయడంతో అమెరికాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో అగ్రరాజ్య అధ్యక్షుడిగా పని చేసిన బిల్ క్లింటన్.. తన సహాయకురాలు మోనికా లెవెన్‌స్కీని ప్రేమించి, వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెల్సిందే. తాజాగా కెన్నడీపై ఇదే తరహా ఆరోపణలు ఒక వృద్ధురాలు చేయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu