బంగ్లాదేశ్‌లోని వాయువ్య రాజ్‌షాహి సెంట్రల్ జైలులో నిర్భంధంలో ఉన్న ఉల్ఫా నాయకుడు అనూప్ ఛేతియాకు ఆ దేశ అధికారులు భద్రతను పెంచారు. సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్‌ను పర్యటించేలోపు ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నారు.
అస్సాంను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని సాయుధ పోరాటం చేస్తున్న ఉల్ఫా మిలిటరీ ఛీఫ్ అయిన ఛేతియా అరెస్ట్ అయి బంగ్లాదేశ్ జైలులో ఉన్నాడు. ఛేతియాను భారత్‌కు అప్పగించే తేదినీ ఇంకా నిర్ణయించలేదని న్యాయపరమైన క్లియరెన్స్ రావాల్సియుందని బంగ్లా హోం శాఖ అధికారులు తెలిపారు.
అనూప్ ఛేతియాను భారత్‌కు అప్పగించనున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి సహారా ఖాతున్ ఈ వారం ప్రకటించారు. అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలో ప్రవేశించినందుకు గానూ ఛేతియా 1997 నుంచి బంగ్లాదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.