Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల చెరలో 25 బందీలు: కాపాడిన కమాండోలు

Webdunia
పాకిస్థాన్‌లోని రావిల్పిండిల ో గల ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌‌కు సమీపంలోని ఓ భవంతిలో నిర్బంధించబడిన 25 మంది బందీలను ఉగ్రవాదుల మూక చెర నుంచి పాక్ ఆర్మీ కమాండోలు విడిపించారు. పాక్ కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు చీఫ్ మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు.

నిన్న పాక్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై ఈ ఉగ్రవాదుల మూక దాడి జరిపిన సంగతి విదితమే. ఈ దాడి సమయంలో హెడ్‌క్వార్టర్స్‌లో 25 మంది భద్రతా సిబ్బందిని ఈ ఉగ్రవాదుల మూక నిర్బంధించింది. వీరిని విడిపించడం కోసం.. సుమారు 20 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌కు పాక్ ఆర్మీ ప్రణాళిక చేసింది.

ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించిన అనంతరం.. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉంటారనే ఉద్ధేశ్యంతో కమాండోలు శోధిస్తున్నారని మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అతార్ అబ్బాస్ తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌లో మృతి చెందిన వారి వివరాలేవీ ఆయన వెల్లడించలేదు.

కాగా, ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల చెరలోని బందీలను పాక్ కమాండోలు విడిపించారు. కమాండోలు ఆపరేషన్ చేపట్టిన అనంతరం అనేక బాంబు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. నిన్న సాయంత్రం కమాండోలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments