ముప్పై మంది అమెరికా నేవీ సీల్స్, ఎనిమిది మంది ఆఫ్ఘనిస్థాన్ కమాండర్లకు మృతికి కారణమైన తూర్పు ఆప్ఘానిస్థాన్‌లో హెలికాప్టర్ కూల్చివేతపై అమెరికా మిలిటరీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ జేమ్స్ మాటిస్ బ్రిగేడియర్ జనరల్ జెఫ్రీ కోల్ట్‌ని ఈ దర్యాప్తుకు సారధిగా నియమించారు. కాగా అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పనెట్టా అధికారికంగా దర్యాప్తు కమిటీని ప్రకటిస్తారని పెంటగాన్ వెల్లడించింది.
తాలిబాన్లు తీవ్రవాదులు దాగివున్న ఒక నివాసంపై దాడి చేసి హెలికాప్టర్‌లో వెళ్తున్న అమెరికా సైనికులపై తాలిబాన్లు క్షిపణితో దాడిచేయటంతో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 30 మంది అమెరికా సీల్స్ కమాండోలతో పాటు 8 మంది ఆఫ్ఘన్ సైనికులు మరణించారు. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లు టెలిఫోన్‌లో సంభాషణలు జరిపారు.