Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీరియా వెళ్లిన గడాఫీ భార్య, ముగ్గురు పిల్లలు

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2011 (10:15 IST)
సుదీర్ఘకాలం పాటు లిబియాను పాలించిన నియంత ముయమ్మార్ గడాఫీ దేశంలో తన పట్టు కోల్పోవడంతో గడాఫీ భార్యతో పాటు ఆయన పిల్లలు ముగ్గురు కూడా సోమవారం లిబియాను వీడి పొరుగున ఉన్న అల్జీరియాకు వెళ్లినట్లు గట్టి ఆధారాలు లభించాయి. అయితే గడాఫీతో పాటు ఆయన కుమారుడు సైఫ్ అల్ ఇస్లామ్‌లు దేశాన్ని వీడిన విషయం ఇంకా ధృవీకరించబడలేదు.

గడాఫీ లిబియాను వీడినట్లు తమ వద్ద సమాచారం లేదని సోమవారం ఒబామా ప్రభుత్వం కూడా వాషింగ్టన్‌లో పేర్కొంది. కాగా గడాఫీ సేనలతో జరుగుతున్న యుద్ధంలో నియంత కుమారుల్లో ఒకరైన మిలిటరీ కమాండర్ ఖామిస్ చనిపోయినట్లు తిరుగుబాటుదారులు సోమవారం తెలిపారు.

గడాఫీ భార్య సాఫియా, కుమారులు హన్నీబల్, మొహమ్మద్, కుమార్తె అయిషాలు సరిహద్దు నుంచి తమ దేశంలోకి ప్రవేశించినట్లు అల్జీరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అల్జీరియా అధికారులు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా మండలి అధ్యక్షుడు, లిబియా తిరుగుబాటుదారుల నాయకత్వానికి తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments