Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా రెస్టారెంట్లో కాల్పులు: నలుగురి మృతి

అమెరికా రెస్టారెంట్లో కాల్పులు: నలుగురి మృతి
, ఆదివారం, 4 ఏప్రియల్ 2010 (15:25 IST)
అమెరికాలోని నార్త్ హాలీవుడ్ జిల్లాలోనున్న ఓ రెస్టారెంట్లో ఆర్మేనియా జాతీయుడు తుపాకితో ప్రవేశించి హఠాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.

రెస్టారెంట్లో జరిగిన కాల్పులు శనివారం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తుపాకీ చేతపట్టి వచ్చిన వ్యక్తి హఠాత్తుగా కాల్పులు జరగడంతో రెస్టారెంట్లో భయంకరమైన వాతావరణం నెలకొందని లాస్ ఏంజెల్స్ పోలీసు ప్రతినిధి రోజారియో హరేరా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తికి 30 సంవత్సరాలుంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతను అర్మేనియాకు చెందినవాడిగా తమ విచారణలో తేలిందని ఆయన తెలిపారు.

కాల్పులు జరిపిన వెంటనే అతను పారిపోయాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్పించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu