Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా బలగాల కొనసాగింపుకు ఇరాక్ ఆమోదం: పనెట్టా

Webdunia
ఏడాది ఆఖరులోపు ఇరాక్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పెట్టుకొన్న గడువు తర్వాత కూడా అమెరికా దళాలు ఉండటానికి ఇరాక్ ఒప్పుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లియోన్ పనెట్టా శనివారం వెల్లడించారు. అనేక దఫాలు చర్చించిన అనంతరం వారు చివరికి ఆమోదం తెలిపారని పనెట్టా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇరాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు గానూ కొంతమంది అమెరికా బలగాలను ఇరాక్‌లోనే ఉంచే విషయమై అమెరికాతో చర్చిస్తామని ఇరాక్ రాజకీయ నాయకులు ఆగస్ట్ 3న ప్రకటించారు. 2008లో కుదిరిన భద్రతా ఒప్పందం ప్రకారం ఇరాక్‌లో ఉంటున్న 46,000 మంది అమెరికా సైనికులు ఈ ఏడాది ఆఖరుకు ఆ దేశాన్ని వీడాల్సి ఉంటుంది. శిక్షణ కార్యక్రమంతో పాటు బలగాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నట్లు పనెట్టా చెప్పారు.

2001 లో అల్‌ఖైదా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడి చేసిన తర్వాత ఇరాక్‌లో మానవహనన ఆయుధాలు ఉన్నాయనే నెపంతో ఇరాక్‌లో అడుగుపెట్టిన అమెరికా సద్ధాం హుస్సేన్ పట్టుకొని ఉరితీయడంతో పాటు తీవ్ర విధ్వంసానికి పాల్పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments