Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నౌకను ఢీకొన్న చైనా జలాంతర్గామి

Webdunia
ఫిలిప్పీన్స్ తీరంలో అమెరికా నౌకా దళానికి చెందిన యూఎస్ఎస్ జాన్ ఎస్ మెక్‌కెయిన్ నౌకను చైనాకు చెందిన ఓ జలాంతర్గామి (సబ్‌మెరైన్) ఢీకొంది. అమెరికా నౌకకు చెందిన సోనార్ అర్రేను నీటిలో చైనా జలాంతర్గామి ఢీకొనట్లు సీఎన్ఎన్ వెల్లడించింది.

సముద్రంలోని శబ్దాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఏర్పాటు (సోనార్ అర్రే)ను చైనా జలాంతర్గాతమి ఢీకొనడంతో, అది ధ్వంసం అయింది. అయితే ఈ జలాంతర్గామి నేరుగా నౌకను ఢీకొనలేదని అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు.

ఈ సంఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు తావివ్వబోదని అమెరికా నేవీ భావిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా నౌకల మధ్య రెండు వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా దూకుడుతో వ్యవహరిస్తోందని అమెరికా ఆ సందర్భంగా ఆరోపణలు గుప్పించింది.

దీనిపై అనంతరం చైనా స్పందిస్తూ.. అమెరికా నావికా దళానికి చెందిన నౌకలు జల సరిహద్దు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అమెరికాకు చైనా విజ్ఞప్తి చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments