Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా దౌత్యాధికారిగా ఎన్ఆర్ఐ

Webdunia
భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు వినయ్ కే. తుమ్మలపల్లిని బెలిజేలో అమెరికా దౌత్యాధికారిగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నియమించారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఒబామా ప్రచార కార్యక్రమాలకుగాను చందాలు వసూలు చేసిన వారిలో ఈయన ఒకరు.

వినయ్ వృత్తిపరంగా మేకానికల్ ఇంజనీయర్. ప్రవృత్తిపరంగా ఆప్టికల్ రికార్డింగ్ కంపెనీ ఎమ్ఏఎమ్ఏలో ప్రముఖమైన వ్యక్తి. కొలరోడోలోనున్న ఈ కంపెనీలో సీడీ ఆర్, డీవీడీ ఆర్‌లను నిర్మించడంలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈయన ఆంధ్రప్రదేశ రాజధాని అయిన హైదరాబాద్‌ నివాసి. 1974లో అమెరికాకు చేరుకుని అక్కడ చదువు, వ్యాపారం కొనసాగిస్తున్నారు.

వినయ్ తన 31 సంవత్సరాల కెరియర్‌లో గతంలో కూడా వివిధ కంపెనీలలో ప్రధాన పదవులను అలంకరించి వాటికి తగిన న్యాయం చేశారు. ఈయన కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయంనుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అలాగే ఎమ్‌బీఏ పట్టాకూడా పుచ్చుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

వినయ్‌తోబాటు మరో ఇద్దరిని కూడా రాజదూత పదవుల కోసం నియమించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరుకూడా అధ్యక్ష ఎన్నికలలో ఒబామా ప్రచార కార్యక్రమాల నిర్వహణకోసం చందాలు వసూలు చేశారు. ఒబామా గెలుపొందిన తర్వాత వీరి మేలుకు తగిన సహాయం చేసినట్లు వీరి మితృబృందం హర్షం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments