Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అణ్వాయుధాల తగ్గింపుకై రష్యా-అమెరికాల ఒప్పందం!

అణ్వాయుధాల తగ్గింపుకై రష్యా-అమెరికాల ఒప్పందం!
FILE
ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలుగా పేరుగాంచిన అమెరికా-రష్యాలు ఓ నూతన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరుదేశాలు తమ అణ్వాయుధాల సంఖ్యను 30 శాతం తగ్గించుకుంటూ.. ఓ కొత్త ఒప్పందంలో సంతకాలు చేశాయి.

పరుగ్వేలో జరిగిన ఓ కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్‌లు అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకునేందుకు సమ్మతిస్తూ.. సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా తమ వద్ద నిల్వవున్న 2,200 అణ్వాయుధాలను 30 శాతం వరకు తగ్గించుకునే దిశగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటాయి. ఇందులో భాగంగా అమెరికా- రష్యాలు అణ్వాయుధాల సంఖ్యను వచ్చే 2012లోపు 1,550 సంఖ్యకు తగ్గించుకుంటాయి.

1991వ సంవత్సరం స్టార్ట్ (Strategic Arms Reduction Treaty - START) ఒప్పందంలో అమెరికా-రష్యా దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారీ సంఖ్యలో నిల్వ ఉంచిన అణ్వాయుధాలు ఇరుదేశాలకు ఉపయోగపడలేదు. దీంతో అణ్వాయుధాలను ఇతర దేశాలకు అందించిన అమెరికా-రష్యాలు.. వీటి సంఖ్యను తగ్గించుకోవాలని భావించాయి.

ఇందులో భాగంగా గత డిసెంబర్‌ నెలతో స్టార్ట్ గడువు ముగియడంతో అణ్వాయుధాల సంఖ్యను తగ్గించే ఒప్పందంలో.. గురువారం ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. సుదూర ప్రయాణానికి ఇదే తొలిమెట్టుగా అభివర్ణించారు.

రష్యా అధ్యక్షుడు మెద్వదేవ్ మాట్లాడుతూ.. అణ్వాయుధాలను పరిమితంగా వాడటం ద్వారా ప్రపంచ దేశాలకు ఎంతో మేలు కలుగుతుందని వెల్లడించారు. ఇంకా అణ్వాయుధాలతో ఏర్పడే వినాశకర సంఘటనలను అరికట్టేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu