Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 17కు ముంబై దాడుల కేసు వాయిదా

Advertiesment
ముంబై దాడుల కేసు
ముంబై దాడుల కేసును అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ కోర్టు వెల్లడించింది. లష్కరే తోయిబా కార్యకలాపాల కమాండర్ జాకీర్ రెహమాన్ లాఖ్వీ సహా ఏడుగురిని కీలక నిందితులుగా పేర్కొనబడిన ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను కోర్టులో పరిశీలించారు.

దీనిపై డిఫెన్స్ లాయర్ల వాదనలను.. ఓ వారం తర్వాత విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను ఎక్కడా వెల్లడించరాదని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రావిల్పిండిలోని అదియాలా కారాగారంలో.. మూసివేసిన తలుపుల వెనుక కోర్టు జడ్జి బకీర్ ఆలీ రాణా నేతృత్వాన న్యాయ విచారణ చేశారు.

అక్కడే.. అక్టోబర్ 17న తదుపరి విచారణ చేపట్టేలా షెడ్యూల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. అంతకుముందు.. ఇరు పక్షాల లాయర్లు జడ్జి ముందు తమ వాదనలను వినిపించినట్లు ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, తమ క్లయింట్లకు వ్యతిరకంగా ఉన్న సాక్ష్యాధారాలు సమర్థించేవిగా లేవని ఈ కేసులో పట్టుబడ్డ ఏడుగురు నిందితుల తరపున వాదిస్తున్న లాయర్లు అంటున్నట్లు తెలిసింది.

మరోవైపు.. భద్రతా కారణాలతో అక్టోబర్ 17న జరిగే విచారణను కూడా అదియాలా కారాగారంలో నిర్వహించనున్నారు. అక్కడ మీడియాను కూడా నిషేధించారు.

Share this Story:

Follow Webdunia telugu