Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు వ్యతిరేకంగా ఆ ఆయుధాలు: యూఎస్ కాంగ్రెస్

భారత్‌కు వ్యతిరేకంగా ఆ ఆయుధాలు: యూఎస్ కాంగ్రెస్
, గురువారం, 10 సెప్టెంబరు 2009 (20:34 IST)
ఇరాక్ నుంచి పాకిస్థాన్‌కు ఆయుధాలు తరలించాలని అమెరికా రక్షణ శాఖ భవనం పెంటగాన్ చేసిన ప్రతిపాదన పట్ల అమెరికా కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఆయుధాలను భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పెంటగాన్‌కు విజ్ఞప్తి చేసింది.

ఆయుధాలను ఇరాక్ నుంచి తరలించేందుకు ఎక్కువ సమయం పట్టదు. అయితే, ఆయుధాలను భారత్‌ సరిహద్దులపై ఇస్లామాబాద్‌ ఎక్కుపెట్టవచ్చని సందేహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ గడ్డపై ఉన్న తాలిబాన్‌తో పాటు.. ఇతర తీవ్రవాద సంస్థల నిర్మూలనకు గాను ఆత్యాధునిక ఆయుధాలను ఇరాక్ నుంచి పాక్‌కు తరలించాలని పెంటగాన్ ఓ ప్రతిపాదన చేసింది.

అంతేకాకుండా, అమెరికా తయారు చేసే ఆయుధాలను సాధారణ ధరకు పాక్‌ భద్రతా బలగాలను అందజేయాలని పెంటగాన్ భావిస్తున్నట్టు అమెరికా వర్గాల సమాచారం. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ వర్జిస్థాన్‌లో తిష్టవేసిన తాలిబన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు తమకు అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చాలని అమెరికాను పాకిస్థాన్ ఎప్పటి నుంచో కోరుతోంది. అంతేకాకుండా, డ్రోన్ టెక్నాలజీని కూడా సమకూర్చాలని బరాక్ ఒబామా యంత్రాంగాన్ని పాక్ ఆర్మీ కోరింది. వీటిద్వారా మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేసేందుకు దోహదపడుతాయని పాక్ ఆర్మీ కోరుతోంది.

Share this Story:

Follow Webdunia telugu