Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో ఫర్నీచర్ మెరిసిపోవాలంటే..?!

వర్షాకాలంలో ఫర్నీచర్ మెరిసిపోవాలంటే..?!

Ganesh

, శుక్రవారం, 23 జనవరి 2009 (20:10 IST)
FileFILE
వేల రూపాయలు పోసి కొన్న ఫర్నీచర్ నాలుగు కాలాలపాటు మన్నికగా ఉండాలని ఎవరికుండదు చెప్పండి. అలా అనుకుంటే మాత్రం సరిపోదు కదా...! అందుకు తగిన జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా పాటించాలి. లేకుంటే... దుర్వాసన పట్టిన కప్‌బోర్డులు, చెమ్మగిల్లిన సోఫాలు, తుప్పుపట్టిన ఫర్నీచర్‌తో ఇబ్బందులు మాత్రం తప్పవు. కాబట్టి, కింది చిట్కాలు పాటించి చూడండి.
గోడలకు కాస్తంత దూరంగా...!
  వార్డ్ రోబ్‌లు, కప్‌బోర్డులు లాంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే వర్షాకాలంలో గోడలు తడవటంతో అవి చెమ్మగిల్లి పాడైపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మీ సోఫాలు, కుర్చీలను ఓ మెత్తటి పొడిబట్టతో...      


సోఫాలను కవర్లతో సరిపెట్టకుండా వాటికింద ఒక ప్లాస్టిక్ షీట్‌ను కూడా వేస్తే మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కుషన్లు పాడవకుండా కాపాడవచ్చు. మంచంపై వాడే పరుపుమీద కూడా ప్లాస్టిక్ కవర్‌ను వేయాలి. మంచి చెక్కతో చేసిన ఫర్నీచర్‌ను కిటికీ పక్కనే పెట్టకూడదు. ఎందుకంటే వర్షంపడే సమయంలో చినుకులు పడటం వల్ల అవి తడిసి పాడవుతాయి.

తేమ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే... సోఫాలు చెమ్మగిల్లుతాయి కాబట్టి... వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మీ సోఫాలు, కుర్చీలను ఓ మెత్తటి పొడిబట్టతో తుడవటం చాలా అవసరం. సోఫా బాడీల ఎక్కడైనా ఫంగస్ పెరుగుతున్నట్లుగా అనిపిస్తే... అరలీటర్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ డెట్టాల్‌ను కలిపి, మెత్తటి బట్టను అందులో ముంచి క్రిములు పట్టిన చోట రుద్దాలి.

ఇకపోతే పాతకాలం నాటి ఫర్నీచర్ లాంటివి ఏమైనా మీ గృహంలో ఉన్నట్లయితే... ఆ గదిలో "డీహ్యూమిడిఫయర్" ఉంచటం మంచిది. అలాగే ఫెస్ట్ కంట్రోల్ సేవలు మరీ మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో చెదలు, ఎలుకలు, బొద్దింకలు, బల్లులతో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

వార్డ్ రోబ్‌లు, కప్‌బోర్డులు లాంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే వర్షాకాలంలో గోడలు తడవటంతో అవి చెమ్మగిల్లి పాడైపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... పైన చెప్పిన చిన్నపాటి జాగ్రత్తలను పాటించి... వర్షాకాలంలో విలువైన వస్తువులు పాడవకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.!

Share this Story:

Follow Webdunia telugu