Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంటగదిలో దుర్వాసన పోవాలంటే...!

వంటగదిలో దుర్వాసన పోవాలంటే...!
వంటగదిలో దుర్వాసన వెదజల్లుతుంటే దానిని నివారించేందుకు ఏం చేయాలనేది ప్రధానంగా మహిళల్లో ఆందోళన ఉంటుంది.

** చేపలతో వంటలు చేసినప్పుడు గిన్నెలకు ఆ వాసన అంటుకుంటుంది. అప్పుడు పాత్రలు కడిగే నీటిలో ఆవాల పొడిని కలపండి. చేపల వాసన పోతుంది.

** చేపలు కోసిన కత్తికి, చేతులకు కూడా ఆవాలపొడి రాసుకోండి వాసన వుండదు.

** కోడిగుడ్డు వాసన పోవాలంటే గిన్నెను కాని, బాండీని కాని శుభ్రం చేశాక ఒకసారి గ్యాస్‌స్టౌపై పెట్టి వేడి చేయండి. గిన్నెలకు వున్న నీచు వాసన పోతుంది.

** ఉల్లిపాయ కోశాక ఏవైనా ప్రూట్స్‌ కట్‌చేద్దామంటే ఉల్లి వాసనే వస్తూ వుంటుంది. అందుకని ఉల్లిపాయను కట్‌చేసిన కత్తిపీటను కానీ, చాకునుకానీ నిమ్మ చెక్కతో రుద్దితే ఉల్లివాసన పోతుంది. అదే విధంగా చేతులకు కూడా నిమ్మ చెక్క రాసుకుంటే వాసన పోతుంది.

** తినేసోడా కలిపిన నీళ్ళతో గిన్నెలను, బాండీలను కడిగితే వాటికంటిన వాసనలు పోతాయి.

** కాలీప్లవర్‌, క్యాబేజీ వండిన పాత్రలకుండే వాసనలు పోవాలంటే, కడిగే నీటిలో పంచదారకానీ, నిమ్మరసంకానీ కలపండి. దీంతో దుర్వాసన పోయి శుభ్రంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu