Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుర ధ్వని, మంద్రస్థాయి సంగీతం...!

మధుర ధ్వని, మంద్రస్థాయి సంగీతం...!

Ganesh

, శుక్రవారం, 23 జనవరి 2009 (20:09 IST)
FileFILE
మీ కలలను సాకారం చేసుకుంటూ కట్టుకున్న సొంత ఇల్లును కళాత్మకంగా, హుందాగా ఉండేలా ఎలా చేసుకోవచ్చో గత వ్యాసంలో చదువుకున్నాం. మరికొన్ని జాగ్రత్తలను చిట్కాలను ఈ వ్యాసంలో చూద్దాం...!

మీ ఆనందాల లోగిలిలో... వంటగదిలో వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చుకుంటే.. వంట చేసేటప్పుడు వంటగదిలో వ్యాపించే వాసనలు, వేడిగాలులు బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా గదిలో చల్లటి వాతావరణం నెలకొంటుంది, పని చేసేవారికి కూడా చికాకు ఉండదు. ఎక్కువ సమయం వంటగదిలో గడిపే గృహిణులకు ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చాలా సౌకర్యంగా ఉంటుంది.
లేత రంగులతో ప్రశాంతత!
  పెద్దల బెడ్‌రూమ్స్ వారి అభిరుచులకు అనుగుణంగా అమర్చుకోవచ్చు. గదిలో పరుపులు, దిండ్లు, దిండుకవర్లు లేత రంగుల్లో ఉంటే మంచిది. ముదురు రంగులు మనసును ప్రశాంతంగా ఉంచకపోవడమే గాకుండా... చిరాకు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.      


ఇక.. వంటగదిలో వస్తువులు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వీలైతే కిచెన్‌లో అల్మారాలు పెట్టుకుంటే... వంట సామాన్లు అన్నింటినీ అందులో పెట్టేయవచ్చు. దీనివల్ల దుమ్ము, ధూళి నుండి పాత్రలను రక్షించుకోవచ్చు.

వంటగదికి వెలుపల భోజనాల గదిలో ఫ్రిజ్‌ను అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఫ్రిజ్‌లోని వస్తువులు అందుకునే వీలుగా వంటగదికి, భోజనాల గదికి మధ్యలో ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే.. హాలు సైజుకు సరిపోయే విధంగా డైనింగ్ టేబుల్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల హాలు అందం ద్విగుణీకృతం అవుతుంది.

ఫ్రిజ్‌లు, గ్రైండర్, ఎలక్ట్రిక్ హీటర్లు లాంటివి వంటగదిలో గ్యాస్ సిలిండర్లకు దగ్గరగా పెట్టుకోకూడదు. స్విచ్ ఆఫ్, ఆన్ చేసే సందర్భాలలో వచ్చే స్పార్క్‌ల వల్ల వంటగ్యాస్ గాలిలో పొరపాటుగా వ్యాపించి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది.

ఇకపోతే... ముఖ్యంగా పిల్లల బెడ్‌రూం అలంకరణలో జాగ్రత్త వహించడం మంచిది. ఖరీదైన వస్తువులు అమర్చాల్సిన పనిలేదు. ఎందుకంటే పిల్లల అభిరుచులు వారి వయసుకు తగినట్లుగా మారిపోతుంటాయి. కాబట్టి, తక్కువ ధర కలిగిన బొమ్మలు, ఆట వస్తువులు కొని వాటిలో అలంకరిస్తే సరిపోతుంది. అలాగే... గోడలకు మంచి మంచి కొటేషన్లు ఉన్న సీనరీలను అమరిస్తే... అవి వారికి మంచి ఆలోచనలను కలిగించి ఉత్సాహపరుస్తాయి.

అలాగే... పెద్దల బెడ్‌రూమ్స్ వారి అభిరుచులకు అనుగుణంగా అమర్చుకోవచ్చు. గదిలో పరుపులు, దిండ్లు, దిండుకవర్లు లేత రంగుల్లో ఉంటే మంచిది. ముదురు రంగులు మనసును ప్రశాంతంగా ఉంచకపోవడమే గాకుండా... చిరాకు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

చివరగా... ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందో ఒక ప్రణాళిక ప్రకారం అమర్చుకోవాలి. తీసిన వస్తువును అవసరం తీరగానే... తిరిగి అదే స్థానంలో ఉంచటం అలవాటు చేసుకోవటం చాలా మంచిది. దానివల్ల ఇంట్లో క్రమశిక్షణ అలవడుతుంది. నిరాడంబరమైన అలంకరణ ఇంటికి కళను, శోభను తెచ్చి పెడుతుంది. చైనీస్ గంటల మధుర ధ్వని, మంద్రస్థాయి సంగీతం ఇంట్లో వాతావరణాన్ని ఉత్తేజభరితంగా మారుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu