Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెడ్‌రూమ్ స్టోర్‌రూమ్‌గా ఉండరాదంటే...

బెడ్‌రూమ్ స్టోర్‌రూమ్‌గా ఉండరాదంటే...
, శుక్రవారం, 23 జనవరి 2009 (20:19 IST)
దేనికయినా ఒక క్రమ పద్ధతి ఉండాలనేది అందరికీ తెలిసిన విషయమే. జీవితం, ఆట, కళ, నైపుణ్యం ఇలా ఏ అంశానికయినా దాని కంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఇల్లు, పడకగదికి కూడా ఇదే వర్తిస్తుంది మరి. మనిషికి సంబంధించిన ఏకైక ఏకాంత ప్రదేశం పడకగది. బెడ్‌రూమును కూడా సరిగా పెట్టుకుంటేనే దానికి అందం, పొందిక ఏర్పడతాయి. బెడ్ రూమ్ అనేది నానా వస్తువులను కలిపి ఉంచే స్టోర్ రూమ్ కాదని గుర్తు పెట్టుకుంటే దాన్ని ఎలా ఉంచాలో అర్థమవుతుంది.

మాసిన బట్టలను, బయటకు పోయివచ్చి వదిలేసిన బట్టలను బెడ్‌రూమ్‌లు కింద్ పడేయకండి.

ఆహార పదార్ధాలను పడకగదిలో ఉంచవద్దు.

ఆహార పదార్ధాలను పడకమీద పెట్టుకుని తినకండి.

పిల్లలు పడకపైనే తింటామని మారాం చేస్తే, పడకపై ఓ ప్లాస్టిక్ క్లాత్ పరిచి తర్వాత వారికి వడ్డించండి

కాళ్లు శుభ్రంగా కడుక్కొన్న తర్వాతే బెడ్ ఎక్కడం పిల్లలకు నేర్పించాలి.

పడక పక్కన కాళ్లు తుడుచుకునే మ్యాట్‌ను తప్పనిసరిగా ఉంచుకోండి.

మురికి బెడ్‌షీట్లు, పాత న్యూస్ పేపర్లు, ప్లవర్‌వాజ్‌లో వాడిన పువ్వులను ఎప్పటికప్పుడు తీసివేయండి.

మీ పడగగదిలోకి వచ్చిన అతిధులు సరాసరి బెడ్ మీద కూర్చోకుండా ఓ రెండు కుర్చీలు ఏర్పాటు చేయండి.

పరుపుమీద గెంతడం, దిండ్లు, దుప్పట్లు చిందరవందర చేయడం కూడదని పిల్లలకు మొదటినుంచే నేర్పండి.

బెడ్ రూములో అటాచెడ్ బాత్రూమ్‌లు ఉంటే వాటిని ప్రతిరోజు తప్పనిసరిగా క్లీన్ చేయండి.

అవసరమనిపిస్తే రూమ్ ప్రెషనర్స్ ఉపయోగించండి.

ఇతరుల బెడ్‌రూములోకి వెళ్లేముందు తలుపు కొట్టి అనుమతి తీసుకుని తర్వాతే వెళ్లమని పిల్లలకు చెప్పండి.

నిద్రపోతున్నప్పుడు మాత్రమే డోర్ లాక్ చేయండి. మిగతా సమయాల్లో తలుపు దగ్గరకు వేస్తే సరిపోతుంది.

ఎక్కువ సమయం బెడ్ రూములో మేలుకోవలసి వస్తే బెడ్ ల్యాంపును ఉపయోగించండి.

Share this Story:

Follow Webdunia telugu