Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి 19న లారాదత్తాను పెళ్లాడనున్న మహేష్ భూపతి!!

ఫిబ్రవరి 19న లారాదత్తాను పెళ్లాడనున్న మహేష్ భూపతి!!
, సోమవారం, 10 జనవరి 2011 (12:54 IST)
WD
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో మహేష్ భూపతి జోడీ కడితేనే మనదేశానికి టైటిల్ ఖరారు అనుకోవచ్చు. ఆదివారం జరిగిన చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ నెగ్గిన మహేష్ భూపతి తన ప్రేయసినే త్వరలో పెళ్లాడనున్నాడు. చెన్నై ఓపెన్‌ విజేతగా నిలచిన ఊపుతో ఉన్న మహేష్ భూపతి నటి లారాదత్తాతో కొనసాగిస్తున్న ప్రేమాయణానికి పెళ్లి బంధంతో ఫుల్‌స్టాఫ్ పెట్టబోతున్నాడు.

పబ్‌లు, రెస్టారెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మహేష్ భూపతి-లారాదత్తాలు ఒక ఇంటివారు కానున్నారు. వీరిద్దరికి ఫిబ్రవరి 19వ తేదీన పెళ్లి జరుగనుంది. ఈ విషయాన్ని పెళ్లికొడుకు మహేష్ భూపతి స్వయంగానే ప్రకటించాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న మహేష్ భూపతి నటి లారాదత్తను ఫిబ్రవరి 19న తన సతీమణిగా చేసుకోబోతున్నట్లు చెన్నై ఓపెన్ డబుల్స్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రకటించాడు. ఇందుకోసం ఇరు కుటుంబీకులు, బంధువులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపతి చెప్పాడు.

కాగా, చెన్నైలో పుట్టి బెంగళూరులో స్థిరపడిన మహేష్ భూపతి డబుల్స్ టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు పది మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu