Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆక్టోపస్ భవిష్యవాణి : జర్మనీకి సెమీస్ బెర్త్ ఖాయం..!

ఆక్టోపస్ భవిష్యవాణి : జర్మనీకి సెమీస్ బెర్త్ ఖాయం..!
FILE
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీకి సెమీస్ బెర్త్ ఖాయమని ఆ దేశ ఆక్టోపస్ చెబుతోంది. కానీ అర్జెంటీనా మాత్రం సెమీఫైనల్‌కు స్థానం లభించడం కష్టమేనని ఆక్టోపస్ అంటోంది. ఇంకా శనివారం అర్జెంటీనాతో జరిగే క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టుదే పైచేయి అవుతుందట...!

ఈ క్రమంలో జర్మనీ, అర్జెంటీనా పేర్లతో తన ముందున్న రెండు బాక్సుల్లో ఆక్టోపస్ జర్మనీ బాక్స్‌నే ఒడిసిపట్టుకుంది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు జర్మనీకి మెండుగా ఉన్నాయని ఆక్టోపస్ తేల్చి చెబుతోంది.

ఇంకా ఆక్టోపస్ చెబుతున్న ఈ భవిష్యవాణి జర్మన్లకు కచ్చితంగా ఉత్సాహాన్నిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే..? ఈ టోర్నీలో ఇప్పటివరకు జర్మనీ ఆడిన మ్యాచుల్లో ఫలితాలన్నీ ఆక్టోపస్ సూచించినట్టే వెలువడటం గమనార్హం.

మరోవైపు.. గ్రూప్-డిలో ఘనా, ఆస్ట్రేలియాలపై జర్మనీ గెలుస్తుందని సూచించిన ఈ ఎనిమిది కాళ్ల జంతువు... సెర్బియా చేతిలో తమ జట్టు ఓడిపోతుందని కూడా సెలవిచ్చింది. ఫలితంగా ఆక్టోపస్ చెప్పినట్లే జరిగింది.

ఇదిలా ఉంటే.. పశ్చిమ జర్మనీలోని ఒబెర్‌హాసెస్‌లో సముద్ర జంతువుల అక్వేరియం ఉంది. ఇక్కడే "పాల్" అనే ఆక్టోపస్ కూడా ఉంది. ఇది ప్రపంచకప్‌లో జర్మనీ గెలుపోటములను ముందే ఊహిస్తోంది. ఈ క్రమంలో ఒక గాజు బాక్సులో జర్మనీ పతాకంతో పాటు ఉంచి, ఆక్టోపస్ వెళ్లి దేనిమీద కూర్చు ఆ జట్టు నెగ్గినట్లేనని నిర్ణయిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu