Article Indian Cookery %e0%b0%ae%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af %e0%b0%aa%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81 108071400066_1.htm

మామిడికాయ పప్పు

Advertiesment
మామిడికాయ పప్పు పచ్చి మామిడికాయలు కందిపప్పు నెయ్యి
కావలసిన పదార్థాలు :
పచ్చి మామిడికాయలు... మూడు
కందిపప్పు... ఒక కప్పు
నెయ్యి... 2 టీస్పూన్లు
ఉప్పు... తగినంత
జీలకర్ర, ఆవాలు, మెంతులు... పోపుకు సరిపడా
పసుపు... అర స్పూను
వెల్లుల్లి... 4 రేకలు

తయారీ విధానం :
ముందుగా మామిడికాయలను సన్నగా తురుమి ఉంచుకోవాలి. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలను పోపు పెట్టి తురిమి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా వేగించాలి. ఆ తరువాత పప్పు, పచ్చిమిరపకాయలు కూడా దానికి కలిపి సరిపడేంత నీరు పోసి బాగా ఉడికించి దించేయాలి. అంతే మామిడికాయ పప్పు రెడీ. మీరూ తయారు చేస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu