Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వందేమాతరం" గీతమంటే ప్రాణం : విక్రమ్

, గురువారం, 14 ఆగస్టు 2008 (13:44 IST)
WD
జాతీయగీతమైన "వందేమాతరం" తనకిష్టమైన గీతమని నటుడు విక్రమ్ తెలియజేస్తున్నారు. "అపరిచితుడు"తో అందర్నీ అలరించిన విక్రమ్ తాజాగా ఇండియన్ జేమ్స్ బాండ్ తరహాలో ప్రజలకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించే కొత్త పాత్రను "మల్లన్న"లో పోషిస్తున్నారు. తమిళంలో "కందస్వామి"గా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సందర్భంగా పంద్రాగాస్టు గురించి చెబుతూ... 13 రాత్రికే తాను ఓ ఫంక్షన్ నిమిత్తం లండన్ వెళ్లనున్నానని, అక్కడా భారతీయులు జరుపుకునే పంద్రాగస్టు ఫంక్షన్‌లో పాలుపంచుకుంటానన్నారు. విద్యార్థి దశలో వైజాగ్‌లోని బోస్టన్ స్కూల్లో చదివిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ... అక్కడంతా క్రమశిక్షణ నేర్చుకున్నానంటూ... అపరిచితుడు గుర్తు చేసుకున్నారు.

"శివపుత్రుడు" తర్వాత ఆ స్కూల్‌కు వెళ్లి తన చేతులమీదుగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం గర్వంగా ఫీలవుతున్నానన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం సముపార్జించిన మహాత్మా గాంధీని ఈ సందర్భంగా తలచుకున్నారు. మనదేశం ఇవ్వని గౌరవాన్ని విదీశీయులు గాంధీకిచ్చారని చెప్పారు. దీనికి ఆయన చిత్రాన్ని మనం తీయకపోవడమే ఉదాహరణగా చెప్పవచ్చునని వెల్లడించారు. గాంధీ చిత్రాన్ని చూసినప్పుడల్లా మనమెందుకు ఆ చిత్రాన్ని మిస్ అయ్యామనే బాధ కలుగుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu