Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అరవిందర్ సందేశం

తొలి స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అరవిందర్ సందేశం
సంపూర్ణ స్వతంత్ర్యం అనే పేరును మొట్టమొదట ఉచ్చరించిన మహామహుడు అరవిందర్. భారత స్వతంత్ర్య పోరాటంలో ఉద్వేగంగా, దేశాభిమానాన్ని నేతాజీకి ఉపదేశించిన అరవిందర్ ఆగస్టు 15వ తేదీ కొత్త యుగ ఆవిర్భావానికి నాందని చెప్పారు. పాతయుగానికి స్వస్తి పలికి ఈ రోజును భారతీయులు ఏనాటీకీ మరువలేరని పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఈ రోజున నేను పుట్టాననడం గొప్ప గౌరవమని చెప్పారు. భవిష్యత్తులో భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో కొత్త యుగాన్ని భారతదేశం ప్రారంభించనుందని తెలిపారు. భగవంతుని సంకల్పంతో జరగాల్సిన కార్యకలాపాలను స్వయంగా చూసేందుకు వీలు కలిగిందని అరవిందర్ చెప్పారు.

స్వాతంత్ర్య భారతావనిలో ప్రతి విషయం ముఖ్యత్వాన్ని వహిస్తుందని ఆయన చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించి దేశం స్వాతంత్ర్యం సాధించింది. అయితే ఏకత్వం ఇంకా పూర్తిగా సాధించలేదు. ఐకమత్యమే భారతదేశానికి ముఖ్యమైన ఆయుధమని అరవిందర్ అన్నారు.

ఇతరదేశాలవలే బ్రిటిష్ ఏకాధిపత్యానికి ముందుండే పరిస్థితులు నెలకొంటాయని భావించాననీ, అయితే అదృష్టకరంగా ఆ పరిస్థితులు తప్పిపోయాయి. భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే భారతీయుల మధ్య ఎలాంటి సమస్యలు వర్గ బేధాలు తలెత్తకూడదని ఆయన సూచించారు.

అంతేకాకుండా స్వతంత్ర్యానికి ముందుండిన హిందూ- ముస్లిం అనే మతబేధాలు ఉండకూదని ఆయన వెల్లడించారు. ఈ భేదాలు అదేవిధంగా కొనసాగితే భారత్ రెండు విభాగాలుగా ఏర్పడే ప్రమాదముందని అరవిందర్ చెప్పారు. దీనితో నిరంతర దాడులకు ఆస్కారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతాలు వేరైనా ఐకమత్యంతో మెలగాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు.

భారతదేశంలోని ప్రజల్లో ఇలాంటి మతవిబేధాలు తలెత్తిన పక్షంలో భారత్‌పై మరల ఇతరదేశాల ప్రభావం పడే అవకాశముందని అరవిందర్ వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ అనే బేధాలు పూర్తిగా నశించి, ఎప్పటికి ప్రజల్లో ఐకమత్యం ఉండాలని ఆయన సూచించారు.

ఈ ఆధునికయుగంలో ప్రతి దేశ ప్రజలు ప్రపంచ ఐక్యతకు పాటుపడాలని పేర్కొన్నారు. ఐకమత్యం అంతర్జాతీయ నినాదంగా చేపట్టబడాలన్నదే తమ ఆశయమని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో ఆధ్యాత్మిక బాటను కొనసాగించాలన్నదే మరో కలని పేర్కొన్న అరవిందర్ ఈ కల ఇప్పటికే నెరవేరిందని చెప్పారు.

ఇందుకు ఉదాహరణగా భారత్‌లో మున్నెప్పుడు లేని విధంగా భారత్‌, ఐరోపా, అమెరికా దేశాల్లో ఆధ్యాత్మికం ప్రాబల్యం చెందిందని చెప్పారు. ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో అధికమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిమనిషి జ్ఞానం కలిగినప్పటి నుంచి తనకు తోచే, సమాజంలో జరిగే కార్యకలాపాలను అనుభవాలుగా తీసుకుని ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటేనే పూర్తి మనిషిగా పరిణతి చెందుతాడని ఆయన బోధించారు. అతడి పరిణామం అభివృద్ధి చెందాలని చెప్పారు.

ఈ ప్రసంగం భారత్‌తో పాటు ప్రపంచంలోని దేశాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు దోహదపడుతాయని ఆయన అన్నారు. ప్రతిమనిషి తన మేథాశక్తితో తమకు జరిగే అడ్డులను దాటుకుని ముందుకెళ్లాలని ఆయన అన్నారు. తన భావాలు స్వాతంత్ర్య భారతదేశంలో ఎంతవరకూ కార్యరూపం ఇస్తుందో వేచి చూడాలని అరవిందర్ తమ ప్రసంగాన్ని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu