Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిననాడే సిసలైన స్వరాజ్యం

ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిననాడే సిసలైన స్వరాజ్యం
పూజ్య బాపూజీ కలలుగన్న సమసమాజం నేటికీ రాలేదని స్వాతంత్ర్య సమరయోధులు కలత చెందుతున్నారు. అమరవీరుల త్యాగాలకు, తమలాంటి వారి ఆకాంక్షలకు తుదిరూపు ఏదని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించాలంటే, సమాజంలో వేళ్ళూనుకున్న ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవాలని చెపుతున్నారు.... ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పరకాల పట్టాభిరామారావు.

ఆయన పశ్చిమగోదావరి జిల్లా కవిటంలో 1920 నవంబర్ 16న జన్మించారు. తన తొమ్మిదో ఏటనే గ్రామాన్ని సందర్శించిన గాంధీజీతో కలిసి పథం కలిపారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష వేసినందుకు నిరసనగా మార్టేరు హైస్కూలులో నిరసన దీక్ష జరిపారు. 1939 సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభలకు ఆహ్వాన సంఘం కార్యదర్శిగా ఉన్న పట్టాభిరావు, సుభాష్ చంద్రబోసుకు ఆహ్వానం పలికారు. ఆయనతో కలిసి రెండు రోజులు గడిపే అవకాశం తనకు కలిగిందని ఎంతో సంతృప్తిగా చెపుతారు.

విశాలాంధ్ర దినపత్రిక, కమ్యూనిజం మాసపత్రికలకు సంపాద వర్గంలో పనిచేసిన పట్టాభిరామయ్య స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఎన్నో నవలలు రచించారు. పురస్కారాలు పొందారు. ఆయన భార్య అహల్యాదేవి కూడా స్త్రీ ఉద్యమకర్త కావడం విశేషం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన స్వాతంత్ర్య యోధుడు పరకాల పట్టాభిరామారావు ఆగస్టు 12 సందర్భంగా "వెబ్‌దునియా తెలుగు"కు ఇచ్చిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ విశేషాలను చూడండి.

Share this Story:

Follow Webdunia telugu