Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహారమే అల్సర్‌కు మందు.. ఇంటి వైద్యంతో కడుపులో మంట మాయం...

ఆహారమే అల్సర్‌కు మందు.. ఇంటి వైద్యంతో కడుపులో మంట మాయం...
, బుధవారం, 26 ఆగస్టు 2015 (15:08 IST)
కడుపులో నొప్పి, తీవ్రమైన మంట ఉంటే అది అల్సర్ అని గుర్తించవచ్చు. అల్సర్‌లు పలు రకాలు ఉన్నాయి. అయితే  కడుపులో వచ్చే అన్ని రకాల అల్సర్లకు ఆహారమే మందు అని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా సమయానికి భోజనం తినకపోవడం వలనే అల్సర్ వస్తుంది. కొన్ని సందర్భాలలో అత్యధికంగా కారపు పదార్థాలు తినడం వలన కూడా అల్సర్ ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. 
 
అయితే ఒక కప్పు మెంతికూర ఆకులను నీళ్లలో ఉడికించి, వాటిలో కొద్దిగా ఉప్పు చేర్చి, ఈ నీటిని గోరు వెచ్చగా చేసి ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే ఎటువంటి అల్సర్ అయినా మటుమాయమవుతుంది. క్యాబేజీ రసం తాగడం వలన కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. అయితే ఈ రసాన్ని పడుకోబోయే ముందు తాగాలి. అల్సర్‌తో బాధపడుతున్న వారికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ పొద్దున్నే అల్పాహారంతో పాటు ఒక చెంచా తేనె తాగాలి. 
 
అరటి పండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనికొస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో వచ్చే పుండ్లు పెరగకుండా చేస్తుంది. విటమిన్ పుష్టిగా దొరికే బాధం, చేపలు వంటివి కూడా అల్సర్లను దరిచేరనీయ్యవు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండే కొబ్బరి నూనె వాడడం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మానతాయి. అందుకే వెజిటబుల్ ఆయిల్స్‌కి బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిది.
 
బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల నొప్పి నుంచి బయటపడొచ్చు. వెల్లుల్లి తినడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. వెల్లుల్లికి కడుపు మంటని తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu