Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తపోటా...? డోంట్ వర్రీ...! ఉల్లి చేస్తుంది మేలు...!

రక్తపోటా...? డోంట్ వర్రీ...! ఉల్లి చేస్తుంది మేలు...!
, శుక్రవారం, 12 డిశెంబరు 2014 (14:55 IST)
ప్రకృతి అందించే ఆహార పదార్థాలతోనే అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ విషయాన్ని పరిశోధకులు పదే పదే రుజువు చేస్తూనే ఉన్నారు. కాకపోతే చాలా మంది సమస్య బాగా తీవ్రమయ్యే దాకా నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు. 
 
తత్ఫలితంగా ఏ అత్యవసర పరిస్థితుల్లోనో ఆస్పత్రిపాలు కావాల్సివస్తోంది. ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో అతి ప్రధాన మైనది రక్తపోటు (బ్లడ్ ప్రసర్ లేదా బీపి). ఇది వంశపారంపర్యాంగా కూడా వస్తుందని పరిశోధకులు గుర్తించారు. 
 
అయితే బీపీ వచ్చిందంటే అది గుండెపోటు ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. బీపీ బారిన పడినా లేక అది రాకుండా ఉండాలన్నా ఉల్లి తీసుకోవడం మేలు అంటున్నారు పరిశోధకులు.
 
ఉల్లి ఘాటుతో కళ్లల్లో నీళ్లయితే రావచ్చు గానీ, రక్తపోటును తగ్గించడంలో మాత్రం ఉల్లి ఒక ధీటైన ఔషధంగా పని చేస్తుంది అంటున్నారు. మాత్రల రూపంలో తీసుకునే క్వెర్సిటిన్ యాంటీ ఆక్సిడెంట్ అనే పదార్థం ఉల్లిలో సమృద్ధిగా ఉందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయింది. 
 
విరివిగా పళ్లు, కూరగాయలు తీసుకోని వారికి వైద్యులు ఈ క్వెర్సిటిన్ మాత్రలే ఇస్తుంటారు. అయితే ఈ మాత్రల కంటే ఎన్నో రెట్లు ప్రభావవంతంగా ఉల్లి పని చేస్తుందని 'ఉఠా' యూనివర్శిటీ పరిశోధకుల అధ్యనంలో వెల్లడైంది. 
 
క్వెర్సిటిన్‌తో పాటు ఆపిల్ లాంటి ఇతర పండ్లల్లో ఉండే ఫ్లావనాల్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వీటికి గుండె రక్తనాళాల్లో వచ్చే సమస్యలను, పక్షవాతాన్ని సమర్థవంతంగా తగ్గించే శక్తి ఉంది.
 
 ప్రత్యేకించి క్వెర్సిటిస్ యాంటీ ఆక్సిడెంటులో రక్తనాళాలను కుంచింపచేసి, తద్వారా రక్తపోటును నియంత్రిస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu