Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జుట్టు పెరగలేదని బాధగా ఉందా...? అయితే వీటితో ట్రై చేయండి..! వేటితో..

జుట్టు పెరగలేదని బాధగా ఉందా...? అయితే వీటితో ట్రై చేయండి..! వేటితో..
, బుధవారం, 26 ఆగస్టు 2015 (07:29 IST)
జుట్టు పెరగడం లేదని.. జుట్టు రాలిపోతోందని చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అయితే అది ఎందుకు జరుగుతుందంటే పూర్తి మనం తీసుకునే ఆహారం వలననే జరుగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. విటమిన్ ఏ లేమి వలన జుట్టు పెరగడం తగ్గుతుంది. దీంతో మరికొన్ని విటమిన్లు జుట్టుపై ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆహారపదార్థాలలో జుట్టుపెరగడానికి అవసరమైన ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. 
 
బంగాళదుంపలో విటమిన్‌ ఎ అధికం. ఇది ఉత్పత్తి చేసే ఒక రకమైన నూనెలాంటి పదార్థం మాడుకు మేలు చేస్తుంది. మాడు పటిష్టంగా ఉంటే చుండ్రు తగ్గుతుంది. ఇక క్యారెట్‌, మామిడి, ఆప్రికాట్స్‌, గుమ్మడి, కర్భూజ వంటి పండ్లు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపకరిస్తాయి. వీటిని ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
 
గుడ్డు తింటే శరీరానికి ప్రొటీన్లు దండిగా లభిస్తాయి. జింక్‌, సెలీనియమ్‌, సల్ఫర్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా గుడ్డులో పుష్కలం. వెంట్రుకలు చిట్లిపోకుండా ఆక్సిజన్‌ను అందించేందుకు ఇనుము తోడ్పడుతుంది. ఇనుము గుడ్డులోనే కాదు.. కోడిమాంసం, చేపల్లోను దొరుకుతుంది. ఐరన్‌, బీటా కెరొటిన్‌, పోలేట్‌, విటమిన్‌ సి.. వంటివన్నీ జుట్టు పెరుగుదలకు అవసరం. 
 
ఈ నాలుగూ తాజా పాలకూరల్లో ఉంటాయి. ఒత్తయిన జుట్టు కావాలనుకుంటున్న వాళ్లు తరచూ పాలకూరను తినాలి. వాల్‌నట్స్‌ను కూడా మరువొద్దు. వీటిలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్‌ అధికం. బయొటిన్‌, విటమిన్‌ ఇ వంటివి సెల్స్‌ను డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. వాల్‌నట్స్‌లో ఉండే రాగి జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu