* పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఉపయోగపడుతుంది.
* రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.
* జలుబుతో బాధ పడేవాళ్లు కర్ఛీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే వెంటనే తగ్గిపోతుంది.
* ఏడు మొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీటిని తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి హాయిగా ఉంటుంది.
* లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవటడంతో బాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.