Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిద్ర సరిగా పట్టడంలేదా.. కొత్తిమీర తీసుకోండి

నిద్ర సరిగా పట్టడంలేదా.. కొత్తిమీర తీసుకోండి
కొత్తిమిరిని దాదాపు 5వేల సంవత్సరాలకుముందే వంటలలో వాడేవారు. యూరోపు రాజ్యనికి చెందిన రాజు దీనిని వంటల్లోకి వాడేవారని, ఇందులో వైద్య గుణాలున్నాయని ఆయన కనుగొన్నారు.

దీనిని పంటగా పండించాలని ఆయన తన అధికారులకు ఆదేశించాడు. ఆ రోజుల్లో పశ్చిమ ప్రాంతాలలోని దేశాలలో అలాగే చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఈ కొత్తిమిరిని విరివిగా వాడేవారు.

కొంతమంది ప్రత్యేకంగా దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. దీనిని తినకపోతే వారికి ఏమీ తోచదు. 18వ శతాబ్దంలో ధనియాలను మౌత్ ఫ్రెష్నర్‌గా వాడేవారు. ఆ తర్వాత దీనిని శాఖాహారం, మాంసాహారం, సూప్‌లలో కూడా ఈ కొత్తిమిరిని వాడడం మొదలుపెట్టారు.

కొత్తిమిరిని వాడడంవలన ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

** కొత్తిమిరి వాడడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

** కొత్తిమిరితోబాటు పుదీనాకూడా కలిపి పచ్చడిగా తయారు చేస్తారు. దీనిని తీసుకుంటే శరీరంలోనున్న అలసటను దూరం చేస్తుంది. దీనిని తీసుకుంటే మంచిగా నిద్రకూడా వస్తుందంటున్నారు వైద్యులు.

** దీనిని శాఖాహారంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

** తాజా కొత్తిమిరి, పచ్చిమిర్చి చట్ని ఉత్తరాంచల్‌లో ప్రసిద్ధి చెందింది. అతిథులువస్తే వారికి దీనిని ఆహారంగా పెట్టడం అక్కడ గౌరవ సాంప్రదాయం.

** గుజరాతీలు కొత్తిమిరి, బెల్లం, వెల్లుల్లిలతో కలిపి చట్నీ చేసుకుని తింటారు.

ఇండ్లల్లో పానీపూరీ చేసుకునేవారు కొత్తిమిరిని విరివిగా వాడుతారు. దీనితో మసాలా నీరును కూడా తయారుచేస్తుంటారు.

** కొత్తిమిరిని పెరుగుతో కలిపి రైతాగా ఉపయోగిస్తారు.

** మాంసాన్ని తాజాగావుంచడానికి కూడా కొత్తిమిరిని వాడుతారు.

ఇన్ని మంచి గుణాలున్న కొత్తిమిరిని వాడడం ఆరోగ్య పరంగా ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు. ఇది సంవత్సరం పొడువునా లభించే పదార్థం. దీని ధర మాత్రం కాస్త తక్కువే.

Share this Story:

Follow Webdunia telugu