Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెన్నీఫర్ లోపెజ్‌ మూడో పెళ్లి కూడా పెటాకులు..!

జెన్నీఫర్ లోపెజ్‌ మూడో పెళ్లి కూడా పెటాకులు..!
, గురువారం, 19 జూన్ 2014 (16:19 IST)
ప్రముఖ హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ మూడో పెళ్లికూడా పెటాకులైంది. ఇదివరకే  రెండు పెళ్లిళ్లు చేసుకున్న జెన్నీఫర్ తన మూడో భర్త మార్క్ ఆంటోనితో విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడంటో వీరి వివాహబంధానికి ఫుల్‌స్టాప్ పడింది. జెన్నిఫర్ లోపెజ్, మార్క్ ఆంటోనికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 2008లో ఈమెకు మాక్స్, ఎమ్మా అనే కవలపిల్లలు జన్మించారు.

మూడున్నరేళ్ల క్రితం విడిపోయిన వీరికి తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. జెన్నిఫర్ లోపెజ్ సంరక్షణలోనే పిల్లలు వుండటంతో నెలలో వారంరోజులు ఆంటోని పిల్లలతో గడిపే అవకాశాన్ని కోర్టు కల్పించింది. జెన్నిఫర్ లోపెజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లి అయ్యాయి. మూడో పెళ్లి కూడా పెటాకులవడంతో ఈ భామ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.

Share this Story:

Follow Webdunia telugu