Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతిగా తాగి.. పునరావాస కేంద్రంలో లిజా మిన్నెల్లీ!

అతిగా తాగి.. పునరావాస కేంద్రంలో లిజా మిన్నెల్లీ!
, గురువారం, 19 మార్చి 2015 (19:25 IST)
హాలీవుడ్ నటి లిజా మిన్నెల్లీ (69) అతిగా తాగి అనర్ధం తెచ్చుకుంది. తన అద్భుత నటనా ప్రతిభతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మిన్నెల్లీ ప్రస్తుతం పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. అతిగా మద్యం సేవించే అలవాటున్న ఆమెకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. 
 
ప్రస్తుతం చికిత్స నుంచి మిన్నెల్లీ కోలుకుంటున్నారని మిన్నెల్లీ ప్రతినిధి స్కాట్ గోరెన్ స్టెయిన్ తెలిపారు. ఆమె ఎక్కడ చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 1973లో 'క్యాబరేట్' చిత్రంలో నటనకు గాను ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది. తాను మద్యానికి బానిసనని బహిరంగంగా చెప్పిన నటీమణుల్లో లిజా మిన్నెల్లీ కూడా ఒకరు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu