Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టైటానిక్ హీరోపై కేట్ విన్ స్లెట్ ప్రశంసల జల్లు: డికాప్రియో మైండ్ చాలా స్ట్రాంగ్!

టైటానిక్ హీరోపై కేట్ విన్ స్లెట్ ప్రశంసల జల్లు: డికాప్రియో మైండ్ చాలా స్ట్రాంగ్!
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (15:24 IST)
1997లో వచ్చిన టైటానిక్ లాంటి అద్భుత సినిమాను మర్చిపోవడం అంత సులభం కాదు. ఈ చిత్రంలో నటించిన లినార్డినో డి కాప్రియో, కేట్ విన్స్ లెట్ జంటని ఇప్పటికి సినీ ప్రేమికులు గుర్తుంచుకుంటారు. 19 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఓ చరిత్రను సృష్టించింది. ఈ నేపథ్యంలో లియోనార్డో డికాప్రియో - కేట్ విన్ స్లెట్ జంట ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్ పైకి కబుర్లు చెబితే ఇదిగో ఇలా ఉంటుంది. 
 
ఒకసారితో స్నేహం చేస్తే డికాప్రియో ఎవరినీ వదలిపెట్టడట. అప్పటికీ ఇప్పటికీ లియోనార్డో అందం కూడా రెట్టింపు అయ్యిందట. ఈ మాటలన్నీ చెప్పినది ఎవరో కాదు.. టైటానిక్ హీరోయిన్ కేట్. డికాప్రియో మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అందరితోనూ స్నేహం చేస్తాడు. కలివిడిగా ఉంటాడు. ఎవరినీ వదిలిపెట్టడు. టైటానిక్ సినిమా చేస్తున్నప్పుడున్న ఫ్రెండ్స్ ఇప్పటికీ అతనితో టచ్‌లో ఉన్నారట. అప్పటికీ ఇప్పటికీ డికాప్రియో అందం ఇంకా పెరిగింది అన్న కేట్ విన్ స్లెట్.. అక్కడితో ఆగలేదు. డికాప్రియోలో ధైర్యం కాస్త ఎక్కువేనని కితాబిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu