Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాశంలో టేలర్ కిన్నేతో పెళ్లి: 2015లో గాగా డుం.. డుం!

ఆకాశంలో టేలర్ కిన్నేతో పెళ్లి:  2015లో గాగా డుం.. డుం!
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (15:33 IST)
పాప్ క్వీన్ లేడి గాగా తన పెళ్లి వినూత్నంగా జరుపుకోవాలని ఉబలాటపడుతోంది. సుదీర్ఘకాలంగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు టేలర్ కిన్నేను 2015లో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. 
 
తన పెళ్లి గురించి కొన్ని తరాల పాటు చెప్పుకునేలా అంతరిక్షంలో జరుపుకోవాలనుందని లేడీ గాగా మనసులో మాట బయటపెట్టింది. వర్జిన్ గాలక్టిక్ ఫ్లైట్‌లో కిన్నేను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది. 
 
ఆకాశంలో ప్రత్యేక ఫ్లైట్‌లో జరుపుకునే పెళ్లికి ఒక్కొక్క సీట్ కోసం 250000 డాలర్లు ఖర్చు అవుతుందని.. అయితే ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని లేడి గాగా అభిప్రాయపడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu