Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా!: జెన్నీఫర్ లోపెజ్.. మరి ఆ లిప్ టు లిప్ కిస్?

ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా!: జెన్నీఫర్ లోపెజ్.. మరి ఆ లిప్ టు లిప్ కిస్?
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (12:13 IST)
ప్రస్తుతానికి తాను ఒంటరిగానే ఉన్నానని గాయకురాలు, నటి జెన్నీఫర్ లోపెజ్ చెప్పింది. గతవారం మాజీ ప్రియుడు కాస్పర్ స్మార్ట్‌తో లిప్ టు లిప్ కిస్ పంచుకున్న ఫోటోను చూసిన అందరూ మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారని భావించారు. అయినప్పటికీ 45 ఏళ్ల ఈ అమ్మడు ఇలా ప్రకటించడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దానిపై జెన్నీని అడగ్గా, "ప్రస్తుతానికి నేను ఒంటరిగా ఉన్నాను. థాంక్యు" అని నవ్వుతూ సమాధానమిచ్చింది. 
 
27 ఏళ్ల డాన్సర్ కాస్పర్, లొపేజ్ మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. గతేడాది వేసవి సమయంలో ఇద్దరూ విడిపోయారు. అంతకుముందైతే ఎక్కడచూసినా ఇద్దరూ కలసి కనిపించేవారు. అయితే ఈ వార్తలను లోపెజ్ ఖండించేటట్టు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఆమైతే ఒంటరిగానే ఉందని లోపెజ్ వెల్లడించింది. మరి స్మార్ట్‌తో లోపెజ్‌కు గల సంబంధం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇందుకు లోపెజ్ ఏం సమాధానమిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu