Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కంటే సాక్షి చౌదరి కష్టపడింది... అల్లరి నరేష్

నా కంటే సాక్షి చౌదరి కష్టపడింది... అల్లరి నరేష్
, శుక్రవారం, 15 మే 2015 (13:06 IST)
హీరోయిన్లు హీరో కంటే కష్టపడటం చాలా అరుదు. అలాంటిది నా సినిమాలోని హీరోయిన్‌ సాక్షి చౌదరి నాకంటే ఎక్కువ కష్టపడింది. రెండు ఫైట్స్‌ కూడా చేసింది. డాన్స్‌ చేసింది. నా పాత్ర అల్లరిచిల్లరిగా వున్నా జేమ్స్‌బాండ్‌ తరహాలో ఆమె రెచ్చిపోయిందని... అల్లరి నరేశ్‌ తెలియజేశారు. 
 
సాయికిషోర్‌ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'జేమ్స్‌ బాండ్‌' నేను కాదు నా పెళ్ళాం అనేది ఉపశీర్షిక. ఇటీవలే పాటలు విడుదలయ్యాయి. సినిమా కూడా పూర్తి వినోదాత్మకంగా వుంటుందని నరేష్‌ చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిరాశపర్చినా ఈ చిత్రం ఆ తప్పుల్ని సరిదిద్దుకునేలా చేసిందన్నారు. సాయి కార్తీక్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. 5 పాటల్లో డెఫినెట్‌‌గా 3 పాటలు హిట్‌ ఆల్బమ్‌ అవుతుంది'' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu