Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్నాల్డ్ మృతి చెందారని పుకార్లు.. కుప్పలు తెప్పలుగా సంతాపాలు..

అర్నాల్డ్ మృతి చెందారని పుకార్లు.. కుప్పలు తెప్పలుగా సంతాపాలు..
, శనివారం, 29 ఆగస్టు 2015 (11:42 IST)
ప్రముఖ హాలీవుడ్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారన్న వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దీంతో ఆయన మృతికి అభిమానులు సామాజికా మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా సంతాపాలు పోస్ట్ చేశారు. అయితే, ఇదంతా కేవలం ఉత్త పురార్లే అని ఆయన అధికార ప్రతినిధులు కొట్టిపారేశారు. వివరాల్లోకి వెళితే.. అర్నాల్డ్ (68) లాస్ ఏంజెలెస్‌లోని కాలిఫోర్నియా హోంలో బెడ్‌పై విగతజీవిగా కనిపించారు. 
 
లాస్‌ఏంజెలెస్ పోలీసులకు చెందిన 911 నెంబర్‌కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అన్ రెస్పాన్సివ్ మేల్ (స్పందించని పురుషుడు) అంటూ ఈ కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు అర్నాల్డ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతలో చనిపోయి ఉండవచ్చని లాస్ ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జేమ్స్ జె.ఫ్రీదా తెలిపారు. 
 
అయితే అర్నాల్డ్ మృతికి గల కారణాలు తెలియరాలేదని.. ఇదే సమయంలో ఆయన మృతిని అతని కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యక్తి కూడా ధ్రువీకరించారు. దీంతో అర్నాల్డ్ మృతి చెందాడనే వార్త దావానంలా ప్రవహించింది. అయితే, అర్నాల్డ్ ప్రతినిధులు శుక్రవారం ఈ వార్తలను కొట్టిపారేశారు. అర్నాల్డ్‌కు ఏమీ కాలేదని, ఆరోగ్యంగా, హాయిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆమ మృతి చెందాడనే వార్త ఉత్త పుకార్లేనని స్పష్టం చేశారు. మరోవైపు, తన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో అర్నాల్డ్ తన ట్వీట్లను పోస్ట్ చేస్తూనే ఉండడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu