Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారం ముందే 'ఎక్సోడెస్‌'...

వారం ముందే 'ఎక్సోడెస్‌'...
, బుధవారం, 26 నవంబరు 2014 (21:44 IST)
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'అవతార్‌', 'లైఫ్‌ ఆఫ్‌ పై', 'టైటానిక్‌' వంటి భారీ చిత్రాలను అందించిన ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్‌ వండర్‌ మూవీ 'ఎక్సోడెస్‌'. గాడ్స్‌ అండ్‌ కింగ్స్‌ అనేది ఉపశీర్షిక. 'గ్లాడియేటర్‌', 'ఎలియాస్‌' వంటి గొప్ప చిత్రాల దర్శకుడు సర్‌ బిరుదు పొందిన గ్రేట్‌ డైరెక్టర్‌ 'రైడ్లీ స్కాట్‌' ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఫాక్స్‌స్టార్‌ ప్రతినిధి ఈ చిత్ర వివరాలు తెలుపుతూ ఈ ఏడాదిలోనే అత్యంత భారీ చిత్రంగా ఈ 'ఎక్సోడెస్‌' రూపొందింది. 
 
ఒక రాజ్యాన్ని పాలించే ఇద్దరు అన్నదమ్ములు కలహాలతో విడిపోయి తమ్ముడు తమ రాజ్యం నుంచి బానిసలుగా వున్న 6 లక్షల మందిని తీసుకెళ్లి యోధులుగా తయారుచేసి అన్నపై యుద్ధం ప్రకటిస్తాడు. మంచికి చెడుకి మధ్య జరిగే ఈ యుద్ధం మానవాతీత శక్తులతో, అత్యంత కీలకమైన అంశాలతో ఆశ్చర్యాన్ని కలిగించేలా చిత్రీకరించబడ్డాయి. ఇప్పటివరకు రాని విచిత్రమైన గ్రాఫిక్‌ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. మానవాతీత శక్తులతో సముద్రాన్ని సైతం రెండుగా చీల్చి యుద్ధాలు చేయడం ఈ చిత్రంలో అత్యంత కీలక ఘట్టం. 
 
ఒకపక్క మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించే సన్నివేశాలతోపాటు క్లాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత భారీ బడ్జెట్‌తో అత్యంత క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటివరకు వచ్చిన 3డి చిత్రాలు చిత్రం రూపొందించిన తర్వాత 3డికి మార్చబడినవి. కానీ ఈ 'ఎక్సోడెస్‌' చిత్రం పూర్తిగా 3డిలోనే చిత్రీకరించబడింది. 
 
ప్రపంచ దేశాలకంటే వారం ముందుగా ఇండియాలో ఈ చిత్రం విడుదల చేయనుండడం విశేషం.  భారతదేశంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అత్యధిక థియేటర్లలో డిసెంబర్‌ 5న విడుదలవుతోంది. క్రిస్టియన్‌బేల్‌, ఆరన్‌పాల్‌, బెన్‌క్లిన్‌స్లే, ఇందిరవర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు రైడ్లీ స్కాట్‌.

Share this Story:

Follow Webdunia telugu