Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోయిన్ ముద్దు ఖరీదు రూ.48,77,010

హీరోయిన్ ముద్దు ఖరీదు రూ.48,77,010
, ఆదివారం, 7 సెప్టెంబరు 2014 (17:54 IST)
హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ హర్లే ఒక్క ముద్దు ఖరీదు సుమారుగా రూ.49 లక్షలు పలికింది. ఆమెను ముద్దెట్టుకునేందుకు కెనడాకు చెందిన భారత సంతతి కుబేరుడు జులియన్‌ భారతి అనే ధనవంతుడు రూ.49 లక్షలు చెల్లించాడు. 
 
ప్రముఖ గాయకుడు ఎల్టన్‌జాన్ నెలకొల్పిన ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అవసరమైన నిధుల సేకరణ కోసం హర్లే తన ముద్దును అమ్మకానికి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఇటీవల వేలం పాటలు నిర్వహించారు. ఇందులో ఈ అందగత్తెని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని రూ.48,77,010 లక్షలు చెల్లించి జులియన్ భారతి దక్కించుకున్నాడు. 
 
బెర్క్‌షైర్‌లోని ఎల్టన్ మాన్షన్‌లో జరిగిన ఈ ముద్దు పెట్టుకునే కార్యక్రమాన్ని తిలకించేందుకు పలువురు మిలియనీర్లు ఒక్కో టికెట్‌కు రూ.3.7 లక్షలు చెల్లించి హాల్‌లోని ఎంటర్ అయ్యారు. 
 

Share this Story:

Follow Webdunia telugu