Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై లైంగిక కేసు.. డెంటల్ టెక్నీషిన్ ఫిర్యాదు!

హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై లైంగిక కేసు.. డెంటల్ టెక్నీషిన్ ఫిర్యాదు!
, ఆదివారం, 5 అక్టోబరు 2014 (10:55 IST)
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై అతని డెంట్ టెక్నీషియన్ చేసిన ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ వద్ద డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో పని చేస్తోంది. చార్లీ షీన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ మార్గరిటా ఫిర్యాదు చేశారు. 
 
49 ఏళ్ల చార్లీ షీన్ సెప్టెంబర్ 25న దంత వైద్యం చేయించుకుంటుండగా, అతని దంతాలకు చికిత్స కోసం వేసిన నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ తీసేసి ఛైర్ నుంచి గెంతి ''నేను నిన్ను .... చంపేస్తాను'' అంటూ పట్టుకున్నాడని, తన దుస్తులు విప్పేసేందుకు కూడా షీన్ తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదు చేశారు. 
 
ఈ మధ్య కాలంలో షీన్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకుంటున్నట్టు ఇతర డెంటిస్టులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. లాస్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పాలెస్టినో న్యాయవాదులు ఈ ఫిర్యాదు చేశారు. గతంలో షీన్ ఓ డెంటిస్టును కత్తితో బెదిరించి, డెంటల్ ఛైర్ను కత్తితో పొడిచి బెదిరించాడని కూడా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu