Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టే హాలీవుడ్ చిత్రం...! ఒబామా-మిషెల్లీ ప్రేమకథ...!

బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టే హాలీవుడ్ చిత్రం...! ఒబామా-మిషెల్లీ ప్రేమకథ...!
, మంగళవారం, 9 డిశెంబరు 2014 (16:22 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రేమ కథ వెండితెరకెక్కబోతోంది. ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ ప్రేమకథ ఆధారంగా ఓ హాలీవుడ్ సినిమా రూపొందించబడుతోంది. సౌత్‌సౌడ్ విత్ యూ పేరిట తెరకెక్కుతున్న సినిమాలో వీరి ప్రేమ వృత్తాంతాన్ని చిత్రీకరిస్తున్నారు. 
 
హాలీవుడ్‌లో హోమ్‌గ్రోన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో మిషెల్లీ పాత్రను టికా సంప్టర్ నటిస్తుండగా, హీరో ఎంపిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒబామా పాత్రలో ఎవరి నటించనున్నారనే అంశం ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 
ఈ చిత్రంలో 1989లో మిషెల్లి - ఒబామాల ప్రేమకు ఎలా బీజం పడింది... వారి డేటింగ్, ఆ తర్వాత వివాహం తదితర అంశాల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు డెడ్‌లైన్ పత్రిక వెల్లడించింది.
 
కాగా చికాగోలోని ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సారి ఒబామా-మిషెల్ కలిసారని, ఇద్దరూ కలిసి లాంగ్ వాల్క్ చేసి ‘డు రైట్ థింగ్’ అనే మూవీ ని చూశారని 2012లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఒబామా వెల్లడించారు. ఈ సంఘటనలు కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయని నిర్మాత తెలిపారు. 
 
ఈ చిత్రం విడుదల అయినట్లైతే హాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దలుకొడుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu