Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రహస్యంగా ఒక్కటైన హాలీవుడ్ జంట బ్రాడ్‌ పిట్ - ఏంజెలినా జోలీ!

రహస్యంగా ఒక్కటైన హాలీవుడ్ జంట బ్రాడ్‌ పిట్ - ఏంజెలినా జోలీ!
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (12:12 IST)
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్, హీరోయిన్ ఏంజెలినా జోలీ రహస్య పెళ్లితో తమ వైవాహిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ కాలిఫోర్నియా న్యాయమూర్తి నుంచి వివాహ అనుమతి పత్రాన్ని తీసుకున్నారు. వీరి పెళ్లిని ఫ్రాన్స్‌లో న్యాయమూర్తి జరిపించారు. ఫ్రాన్స్‌లోని చాటీ మిరావల్‌లో జరిగిన ఈ వివాహ ఘట్టానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. 
 
కాగా, 39 యేళ్ల జోలీకి ఇది మూడో వివాహం. అలాగే 50 యేళ్ల బ్రాడ్ పిట్‌కు రెండో వివాహం. వీరిద్దరు సహజీనం ద్వారా ఒక ఆడపిల్ల, ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. మరో ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలను కూడా దత్తత తీసుకున్నారు. 2005 సంపత్సరంలో మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ చిత్రంలో వీరిద్దలు తొలిసారి కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu